Srilatha: భార్యను హత మార్చేందుకు సినీ ఫక్కీలో స్కెచ్ వేసిన భర్త!

  • కొంతకాలంగా భార్యతో విభేదాలు
  • శ్రీలతను కారుతో ఢీకొట్టిన శివాజీ
  • రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
  • పరారీలో నిందితుడు

భార్యతో విభేదాల నేపథ్యంలో ఆమెను హతమార్చేందుకు ఓ టీడీపీ నేత ప్లాన్ చేశాడు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని కె.బిట్రగుంట గ్రామానికి చెందిన టీడీపీ నేత వి. శివాజీకి కొంతకాలంగా భార్య శ్రీలతతో విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలతను హతమార్చేందుకు పథకం వేశాడు.

నేటి ఉదయం శ్రీలత తన బాబాయి పిచ్చయ్య చౌదరితో బైక్ పై కలిసి టంగుటూరు వెళుతుండగా, తూర్పునాయుడుపాలెం గ్రామ సమీపంలో మాటు వేసి, తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీలత, పిచ్చయ్య చౌదరికి స్వల్ప గాయాలవడంతో వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ఎస్సై హజరతయ్య తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News