ntr: ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో ఆయన కనిపిస్తాడట

  • చరణ్ జోడీగా అలియా భట్ 
  • ఎన్టీఆర్ రెండవ నాయికగా నిత్య 
  • కీలకమైన పాత్రలో సముద్రఖని

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన ఇద్దరు నాయికలు కనిపించనున్నారట. ప్రధాన నాయికను ఇంకా ఎంపిక చేయలేదు. రెండవ నాయికగా నిత్యామీనన్ ను తీసుకున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం తమిళ నట దర్శకుడు సముద్రఖనిని ఎంపిక చేసుకున్నారు. ఆయనను ఏ పాత్ర కోసం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ బాబాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. అంటే కొమరం భీమ్ కి బాబాయ్ పాత్రను పోషించనున్నాడన్న మాట. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమనీ, అందుకే ఆయనను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలుకానుంది.

More Telugu News