Andhra Pradesh: ఏపీ మంత్రి సోమిరెడ్డికి మళ్లీ షాక్.. ఈరోజు ముఖం చాటేసిన ఉద్యానవన శాఖ అధికారులు!

  • మంత్రి సమీక్షా సమావేశానికి డుమ్మా
  • ఈసీ కోడ్ నేపథ్యంలో జాగ్రత్తలు
  • ఎవ్వరూ రాకపోవడంతో వెనుదిరిగిన సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. అమరావతిలోని తన ఛాంబర్ లో నిన్న సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి  వ్యవసాయ శాఖ అధికారులు గైర్హాజరు కాగా, ఈరోజు ఉద్యానవన శాఖ అధికారులు సైతం అదే బాటలో పయనించారు. ఈ రోజు ఏపీ ఉద్యానవన శాఖ పనితీరుపై సమీక్ష చేపట్టాలని మంత్రి సోమిరెడ్డి నిర్ణయించారు.

ఇందులో భాగంగా సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమీక్షా సమావేశానికి వెళితే ఏం ఇబ్బంది వస్తుందో అని భావించిన అధికారులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అధికారుల కోసం ఎదురుచూసిన సోమిరెడ్డి, చివరికి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Andhra Pradesh
somireddy
angry
review meeting
officials absent
Telugudesam

More Telugu News