modi: అయోధ్య ర్యాలీలో రామ మందిరం ఊసే ఎత్తని మోదీ!

  • కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై విరుచుకుపడ్డ మోదీ
  • సభకు భారీ సంఖ్యలో హాజరైన సాధువులు
  • రామ మందిరం ఊసెత్తకపోవడంతో.. నిరాశకు గురైన వైనం

అయోధ్యలో ఈరోజు నిర్వహించిన బీజేపీ ర్యాలీలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై ప్రధాని మోదీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అయితే, బీజేపీకి ట్రంప్ కార్డ్ అయిన రామ మందిరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

'కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల గురించి నిజాలు తెలుసుకోవాలి. అంబేద్కర్ పేరును వాడుకునే మాయావతి.. ఎప్పుడూ ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తారు. లోహియా పేరును వాడుకునే సమాజ్ వాదీ పార్టీ... యూపీలో శాంతిభద్రతలను భ్రష్టు పట్టించింది. పేదల గురించి కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోదు. సొంత లాభాలు, ఒక కుటుంబం (గాంధీ) యొక్క సంక్షేమమే ఆ పార్టీకి కావాలి' అని మోదీ విమర్శించారు.

పేదలు, కార్మికులు ఉన్నత పథంలో పయనించాలని... వారికి అవసరమైన అవకాశాలను కల్పించాల్సి ఉందని మోదీ అన్నారు. పేదల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు మెతక వైఖరిని అవలంబించాయని విమర్శించారు. మన పొరుగున ఉన్న కొన్ని దేశాలకు ఇలాంటి వైఖరే కావాలని... ఇది దేశ భద్రతకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. దేశ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు.

మరోవైపు, మోదీ ర్యాలీకి సాధువులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. రామ మందిరం గురించి మోదీ మాట్లాడతారని ఆశించిన వారికి చివరకు నిరాశే ఎదురైంది.

  • Loading...

More Telugu News