Snake: పూటుగా మందుకొట్టి పామును పట్టబోతే..!

  • కర్ణాటకలో ఘటన
  • కాటేసిన పాము
  • ఆసుపత్రిలో చికిత్స
మందుబాబులు మరికాస్త పూటుగా తాగిన వేళ చేసే చర్యలు భలే గమ్మతుగా అనిపిస్తుంటాయి. అటువంటి ప్రయత్నాన్నే చేసిన ఓ కన్నడవాసి ఆసుపత్రి పాలయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని నేలమంగళ పట్టణంలోని విశ్వేశ్వరపురలో గోవిందరాజు అనే వ్యక్తి పెయింటర్ గా పని చేస్తున్నాడు. మద్యం తాగడం అలవాటు చేసుకున్న గోవిందరాజు, ఇటీవల పూటుగా తాగి కాలనీకి వస్తున్న వేళ, కొందరు హడావుడిగా 'పాము పాము' అనడాన్ని చూశాడు.

అప్పటికే మత్తులో ఉన్న ఆయన, దాన్ని తాను పట్టుకుంటానని చెప్పి ముందుకెళ్లాడు. పాములు పట్టడంలో ఏ మాత్రమూ అనుభవం లేని గోవిందరాజు, పామును పట్టే క్రమంలో దాని కాటుకు గురయ్యాడు. దీంతో ఆయన అస్వస్థత పాలుకాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గోవిందరాజుకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించగా, ఆయన చేసిన పనికి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదని స్థానికులు వ్యాఖ్యానించారు.
Snake
Dring
Karnataka

More Telugu News