Telangana: సికింద్రాబాద్ లో కారు బీభత్సం.. పలువురికి తీవ్రగాయాలు!

  • ప్యాట్నీ సెంటర్ లో ఈరోజు ఉదయం ఘటన
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఈరోజు ఓ కారు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ లోని ప్యాట్నీ సెంటర్ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు.. అక్కడే ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు ఎగిరి బయటపడ్డారు. వీరిలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. అయినా సదరు వాహనదారుడు కారును ఆపకుండా వేగంగా తీసుకెళ్లిపోయాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశారు. కారు జాడ కోసం అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Telangana
Road Accident
Hyderabad

More Telugu News