Marriage: పెళ్లి వేడుకలో భార్యను మరిచి 'పబ్ జీ'లో మునిగిపోయిన వరుడు... వీడియో!

  • వివాహం తరువాత రిసెప్షన్
  • ఆటను వదలని వరుడు
  • అమాయకంగా చూస్తుండిపోయిన వధువు

వివాహం జరుగుతూ ఉందంటే, అది వధూవరులకు జీవితంలో మరపురాని రోజవుతుంది. వివాహం కాగానే, ఒకే చైర్ లో కూర్చుని తమను ఆశీర్వదించేందుకు వచ్చిన వారి నుంచి కానుకలు, అభినందనలు అందుకునే క్షణాలు ఎంతో మధురం. ఆ సమయంలోనూ ఓ వరుడు, 'పబ్ జీ' అడుకుంటూ కనిపిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కన కూర్చున్న వధువు అమాయకంగా చూస్తుండగా, తనను అభినందించే వారిని కూడా పట్టించుకోని ఆ వరుడు తనను బానిసగా చేసుకున్న ఆటలో ఎలా నిమగ్నమయ్యాడో మీరూ చూడండి.


More Telugu News