kcr: తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ కవితలపై ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు.. ప్రైవేటు ఉద్యోగి అరెస్ట్

  • సైబర్ క్రైం పోలీసులకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడి ఫిర్యాదు
  • రెండు ఖాతాల నుంచి అసభ్య రాతలు
  • ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడికి అరదండాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు రాస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్, కవితలను కించపరిచేలా ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు రాస్తున్నారంటూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ఫేస్‌బుక్ ఖాతాల్లో కవిత, కేసీఆర్‌లపై అసభ్య రాతలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఫేస్‌బుక్ నిర్వాహకులను సంప్రదించి ఆ పోస్టులు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఐపీ అడ్రస్‌లు సంపాదించారు. వాటి ఆధారంగా నిందితుడి కోసం వేట ప్రారంభించిన పోలీసులు  మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి చిప్రా నరేష్‌‌ను అరెస్ట్ చేశారు.
kcr
K Kavitha
Facebook
cyber crime
Hyderabad
mahaboobnagar

More Telugu News