ఎస్పీవై రెడ్డి మృతికి చంద్రబాబు, పవన్ ప్రగాఢ సంతాపం
- నంది గ్రూపుతో ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్పనేత
- ఆయన మృతి నంద్యాలకు తీరని లోటు: బాబు
- రాజకీయాల్లో హుందాతనానికి నిదర్శనం: పవన్
ఎస్పీవై రెడ్డి మృతి వార్త తెలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం పాటించిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. రాజకీయాల్లో ఆయన అనుభవం, సేవాగుణం పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయనే జనసేనలోకి ఆయనను ఆహ్వానించినట్టు చెప్పారు.