Nitya menon: మా అమ్మకు కేన్సర్ మూడో దశలో ఉంది.. అది గుర్తొస్తే షూటింగులో ఏడుస్తుంటాను!: నిత్యా మీనన్

  •  నాకు మైగ్రేన్ కూడా వుంది 
  • అప్పుడు ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేను
  • తనపై జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనన్న నిత్యా 
ఓ ప్రాజెక్టు విషయంలో తనతో మాట్లాడేందుకు వచ్చిన నిర్మాతలను కలిసేందుకు ఇటీవల కథానాయిక నిత్యామీనన్ నిరాకరించిందట. దీంతో నిత్యాకు పొగరని మాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో భాగంగా నిత్యాను మాలీవుడ్ నుంచి నిషేధిస్తామంటూ కొందరు నిర్మాతలు బెదిరించినట్టు పేర్కొంది.

ఈ విషయమై నిత్యా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తన తల్లికి కేన్సర్ మూడో దశలో ఉందని, షూటింగ్ సమయంలో తన తల్లి గుర్తొస్తే వ్యాన్‌లోకి వెళ్లి ఏడుస్తుంటానని తెలిపింది. అలాగే తనకు మైగ్రేన్ ఉందని, నిర్మాతలు వచ్చిన సమయంలో తాను ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేనని తెలిపింది. తనకు పొగరు అని ప్రచారం జరుగుతోందని, తాను వాటిని పట్టించుకోనని నిత్య తెలిపింది.
Nitya menon
Project
Producers
Mollywood
Cancer
Migrane

More Telugu News