Chandrababu: మే 2 నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్న చంద్రబాబు

  • ఒక్కో స్థానం నుంచి 50 మంది నేతలు
  • రోజుకు రెండు పార్లమెంట్ స్థానాలు
  • పలు కీలక విషయాలపై చర్చ
టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి, నాయకుల పనితీరు, బూత్‌ల వారీగా పోలిగ్ సరళితో పాటు కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై ముఖ్యంగా పార్టీ నేతలతో చర్చించనున్నారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరగనున్న టీడీపీ సమీక్ష సమావేశాలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమీక్ష సమావేశానికి ఒక్కో పార్లమెంటరీ స్థానం నుంచి 50 మంది ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రోజుకు రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలపై సమీక్షలు జరపాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం.
Chandrababu
Polling Booth
Counting
Telugudesam
Parliament
Assembly

More Telugu News