తెలుగు విద్యార్థులందరికీ అభినందనలు: నారా లోకేశ్

30-04-2019 Tue 12:22
  • అభినందనలు తెలిపిన లోకేశ్ 
  • మున్ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్ష 
  • తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలన్న మంత్రి
తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు జేఈఈ మెయిన్ ఫలితాలలో టాప్ ర్యాంకులు సాధించి, తమ సత్తా చాటడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. 'జేఈఈ మెయిన్‌ తొలి 24 ర్యాంకుల్లో 6 ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కార్తికేయ, సాయికిరణ్, విశ్వంత్, కొండా రేణు, జయంత్ ఫణి సాయి, చేతన్ రెడ్డిలకు హార్దిక శుభాకాంక్షలు. అలాగే మొదటి వంద ర్యాంకుల్లో 40 ర్యాంకులను సొంతం చేసుకున్న విద్యార్థులతో పాటు, జేఈఈలో అర్హత సాధించిన తెలుగు విద్యార్థులందరికీ అభినందనలు. మీరంతా మున్ముందు మరిన్ని విజయాలను అందుకుని తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నాను' అంటూ లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.