burkina faso: ఆఫ్రికా దేశంలో చర్చిపై ఉగ్రదాడి... ఆరుగురి దుర్మరణం

  • బుర్కినా ఫాసోలో నరమేధం
  • మోటార్ బైక్ లపై వచ్చి కాల్పులు
  • 2016 తర్వాత పశ్చిమ ఆఫ్రికాలో చర్చిపై ఇదే తొలి దాడి

శ్రీలంకలోని చర్చిలపై ఉగ్రదాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒక పాస్టర్, అతని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మరో ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించలేదు. మధ్యాహ్నం 1 గంట సమయంలో చర్చిలో ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా... ఏడు మోటార్ బైక్ లపై వచ్చిన ఆగంతుకులు వారిపై తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఎంతమంది దాడికి పాల్పడ్డారు అనే విషయంలో క్లారిటీ రాలేదు. మరోవైపు, దాడికి తామే పాల్పడినట్టు ఇంత వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు. 2016లో పశ్చిమ ఆఫ్రికాలో జిహాదిస్ట్ హింస చోటు చేసుకున్న తర్వాత చర్చిపై జరిగిన తొలి ఉగ్రదాడి ఇదే.

More Telugu News