KTR: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు కేటీఆర్ పెట్టిన టైటిల్ ఇదే!

  • రెండు రోజుల క్రితం అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు
  • నేనైతే 'రీజనల్ రింగ్ రోడ్' అని పెడతా
  • నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం
  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఓ టైటిల్ ను అభిమానులు చెప్పాలని చిత్ర యూనిట్ కోరిన సంగతి తెలిసిందే. దీనికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత కేటీఆర్, తనదైన శైలిలో టైటిల్ ను పెట్టారు. రెండు రోజుల క్రితం అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇస్తూ, ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై స్పందించారు. 'ఆర్ఆర్ఆర్'కు మీరైతే ఏం టైటిల్ పెడతారని అడుగగా, తానైతే 'రీజనల్ రింగ్ రోడ్' అని సూచిస్తానంటూ తనదైన శైలిలో స్పందించారు. ఇక కేటీఆర్ సూచించిన టైటిల్ ను రాజమౌళి తీసుకుంటారో లేదో మరి!
KTR
RRR
Rajamouli
Regional Ring Road

More Telugu News