Maharashtra: రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

  • 40 మీటర్ల దూరంగా ల్యాండ్ అయిన విమానం
  • పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
  • నిలిచిపోయిన కార్యకలాపాలు
మహారాష్ట్రలోని షిర్డీ విమానాశ్రయంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న సమయంలో స్పైస్‌జెట్ విమానం ఒక్కసారిగా రన్‌వేపై అదుపు తప్పి పక్కకు జారింది. ల్యాండ్ కావాల్సిన ప్రదేశానికి 40 మీటర్ల దూరంగా విమానం భూమిని తాకి అదుపు తప్పినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియరాలేదు. కాగా, ఈ ఘటన తర్వాత విమానాశ్రయ కార్యకలాపాలు కొంతసేపు నిలిచిపోయినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. 
Maharashtra
shirdi airport
spice jet
runway
accident

More Telugu News