Ramesh: నిన్నటితో పోలిస్తే ఫణి మరింత బలపడింది: ఐఎండీ డైరెక్టర్ రమేశ్

  • రేపు తుపానుగా మారే అవకాశం
  • తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ప్రభావం
  • 1 నుంచి ఏపీ తీరానికి దూరంగా ప్రయాణిస్తుంది
నిన్నటితో పోలిస్తే ఫణి తుపాను మరింత బలపడిందని ఐఎండీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. అది కాస్తా రేపు పెను తుపానుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తుపాను ప్రభావం పెద్దగా ఉండదని, తీరం వెంబడి పయనించడం వల్ల ఏపీలో ప్రభావం తక్కువేనన్నారు. విశాఖ, మచిలీపట్నం, శ్రీకాకుళంలలో మాత్రం వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని రమేశ్ వెల్లడించారు. మే 1 నుంచి ఏపీ తీరానికి దూరంగా ప్రయాణిస్తుందని, నాలుగో తేదీన తుపాను ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందన్నారు.
Ramesh
Phani Cyclone
Telugu States
Visakha
Machilipatnam
Srikakulam

More Telugu News