dk sivakumar: డీకే శివకుమార్ కు చెందిన రూ. 500 కోట్ల బినామీ ఆస్తుల జప్తు

  • కర్ణాటక మంత్రి శివకుమార్ పై ఐటీ దాడులు
  • తల్లి గౌరమ్మకు నోటీసులు
  • ఇదంతా బీజేపీ కుట్ర అని మండిపడ్డ శివకుమార్
కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రూ. 500 కోట్ల విలువైన బినామీ ఆస్తిని ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. మరో 20 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని శివకుమార్ తల్లి గౌరమ్మకు నోటీసులు జారీ చేశారు. ఈ ఆస్తిని శోభా డెవలపర్స్ తో శివకుమార్, గౌరమ్మలు ఉమ్మడిగా ఒప్పందం చేసుకున్నారు. గతంలో కూడా శివకుమార్ పై ఐటీ దాడులు జరిగాయి. అయితే, రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ తనపై ఈ దాడులు చేయిస్తోందని ఆయన మండిపడుతున్నారు.
dk sivakumar
karnataka
congress
it
raids

More Telugu News