Andhra Pradesh: తెలంగాణలో నేటి వాతావరణంలో విచిత్ర పరిస్థితి!

  • నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు
  • వర్షాలు పడని ప్రాంతాల్లో వడగాలులు
  • ఏపీలో బలపడిన ఫణి తుపాను ప్రభావం

తెలంగాణలో నేడు వాతావరణంలో విచిత్ర పరిస్థితులు కనిపించనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. వర్షాలు కురవని ప్రదేశాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను ప్రభావం తెలంగాణపై ఉండదన్న అధికారులు.. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

మరోవైపు, ఫణి తుపాను సోమవారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారింది. మంగళవారం అది అతి తీవ్ర తుపానుగా మారనుంది. 1న పెనుతుపానుగా మారి, 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణించే సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News