Xiaomi: శాంసంగ్ ను వెనక్కినెట్టేందుకు ఆఫ్ లైన్ మార్కెట్ పై కన్నేసిన షామీ

  • ఆఫ్ లైన్ మార్కెట్లో ఇప్పటికీ శాంసంగ్ హవా
  • ఆన్ లైన్ మార్కెట్లో తిరుగులేని షియోమీ 
  • శాంసంగ్ కు దీటుగా అమ్మకాల కోసం సరికొత్త ప్రణాళికలు

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొంతకాలంగా శాంసంగ్, షియోమీల మధ్య హోరాహోరీ పోరాటం నడుస్తోంది. ఆఫ్ లైన్ మార్కెట్ ను దన్నుగా చేసుకుని తన బ్రాండ్ ఇమేజ్ తో శాంసంగ్ ఆధిపత్యం చెలాయిస్తుండగా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ సైట్ల అండతో షియోమీ ఆన్ లైన్ మార్కెట్లో తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తోంది. అయితే,  ఆఫ్ లైన్ మార్కెట్లో శాంసంగ్ స్థానాన్ని ఆక్రమించేందుకు షియోమీ ఇండియా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

ఆఫ్ లైన్ మార్కెట్లో శాంసంగ్ ఎలా సక్సెస్ అయిందో పరిశీలించామని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ చెబుతున్నారు. ఆఫ్ లైన్ లో శాంసంగ్ అమ్మకాలు గమనించిన తర్వాత తాము సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించామని, త్వరలోనే శాంసంగ్, వివో కంపెనీలకు దీటుగా ఆఫ్ లైన్ లో షియోమీ కూడా బలమైన మార్కెట్ ను సొంతం చేసుకుంటుందని జైన్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తమకు ఆఫ్ లైన్ మార్కెట్ లో 20 శాతం వాటా ఉందని తెలిపారు. ఆఫ్ లైన్ మార్కెట్లో ప్రవేశించిన తొలి ఆరు నెలల్లో అతి కష్టమ్మీద అమ్మకాలు చేయగలిగామని, దాంతో, శాంసంగ్, వివో వంటి ప్రత్యర్థులు ఎలా అమ్మకాలు చేస్తున్నారో గమనించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామని వివరించారు.

More Telugu News