Telangana: బంగారు తెలంగాణ కాదు.. బలుల తెలంగాణాగా మారిపోయింది!: బీజేపీ నేత దత్తాత్రేయ

  • ఇంటర్ విద్యార్థుల మరణాలపై ఆవేదన
  • దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • హైదరాబాద్ లో మీడియాతో కేంద్ర మాజీ మంత్రి
తెలంగాణ ఇంటర్ ఫలితాల విషయంలో చెలరేగిన వివాదంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ స్పందించారు. ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన గ్లోబరినా సంస్థ, దానివెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదని తేల్చిచెప్పారు.

హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రేపు బీజేపీ నిరాహార దీక్ష చేపట్టబోతోందని వ్యాఖ్యానించారు. ఈ దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని దత్తాత్రేయ కోరారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కావడం పక్కనపెడితే ఇప్పుడు బలుల తెలంగాణగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana
inter
results
BJP
bandaru
dattatreya
Hyderabad

More Telugu News