Andhra Pradesh: ప్రభావం చూపుతున్న ఫణి తుపాను.. కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం!

  • 10 మండలాల బాధ్యతలు అప్పగింత
  • 8672-252174 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
  • సహాయ చర్యలకు సిద్దంగా జిల్లా యంత్రాంగం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫణి తుపాను నిదానంగా తీరం వైపు కదులుతోంది. దీని కారణంగా సముద్రం పోటెత్తడంతో పాటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్యలో ఈ నెల 30న తీరం దాటే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

తుపాను ప్రభావం ఉంటుందని భావించిన 10 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఒకవేళ భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టే పూర్తి అధికారాలను వీరికి అప్పగించారు. అంతేకాకుండా ప్రజల కోసం 08672-252174 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

More Telugu News