Andhra Pradesh: ఏపీలో స్పెషల్ డీఎస్సీ పరీక్షకు బ్రేక్.. కొన్నిరోజులు వాయిదా పడే ఛాన్స్!

  • కాంట్రాక్టు ఉద్యోగుల వయోపరిమితి పెంచిన సర్కారు
  • వారంతా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంపు
  • నిర్ణయం తీసుకోనున్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో నిర్వహించనున్న ప్రత్యేక డీఎస్సీ పరీక్ష వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. అందులో భాగంగా గరిష్టంగా 54 ఏళ్ల వయస్సున్న వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

తాజాగా వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాల్సి రావడంతో పరీక్ష కొన్నిరోజులు వాయిదా పడే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి.
Andhra Pradesh
special dsc
postponed

More Telugu News