Maruti Rao: మారుతీరావు విడుదల కాగానే... భారీ కాన్వాయ్ లో తీసుకెళ్లిన వైశ్య ప్రముఖులు, కుటుంబీకులు!

  • దాదాపు ఆరు నెలల జైలు జీవితం
  • ఈ ఉదయం విడుదలైన నిందితులు
  • 20 పైగా వాహనాల కాన్వాయ్
మిర్యాలగూడలో పరువు హత్యకు పాల్పడి, దాదాపు ఆరు నెలలకు పైగా జైలు జీవితాన్ని గడిపిన మారుతీరావుతో పాటు సహ నిందితులు కరీమ్, శ్రవణ్ లు ఈ ఉదయం వరంగల్ జైలు నుంచి విడుదలైన సమయంలో అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. మారుతీరావు జైలు నుంచి విడుదల కానున్నారని ముందే సమాచారం ఉండటంతో, మిర్యాలగూడకు చెందిన పలువురు వైశ్య వర్గం ప్రముఖులు ఆయన్ను చూసేందుకు జైలు వద్దకు వచ్చారు. వారితో పాటు మారుతీరావు కుటుంబ సభ్యులు కూడా జైలుకు చేరుకున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే, ప్రత్యేక వాహనంలో ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. దాదాపు 20కి పైగా వాహనాలు దాన్ని వెంబడించాయి. కాగా, మారుతీరావు తన కుమార్తె జోలికి పోరాదని, తనపై ఉన్న హత్య కేసులో సాక్ష్యాలను చెరిపేందుకు ప్రయత్నించరాదని, విదేశాలకు వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే.
Maruti Rao
Miryalaguda
Jail

More Telugu News