Mimi chakraborthy: నా ఆస్తులింతే.. ఎన్నికల అఫిడవిట్‌లో బెంగాలీ నటి మిమి చక్రవర్తి

  • మిమి చక్రవర్తి మొత్తం ఆస్తుల విలువ రూ.2.43 కోట్లు
  • చేతిలో రూ.25 వేల నగదు
  • కోల్‌కతాలో రూ.1.19 కోట్ల విలువ చేసే ఫ్లాట్
బెంగాలీ ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మిమి చక్రవర్తి తన ఆస్తులను రూ.2.43 కోట్లుగా ప్రకటించారు. జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మిమి నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఈ వివరాలను పేర్కొన్నారు. తన ఆస్తుల మొత్తం విలువ రూ.2.43 కోట్లుగా పేర్కొన్న ఆమె.. చేతిలో రూ.25వేల నగదు ఉన్నట్టు తెలిపారు. బ్యాంకులో రూ.71.89 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 వేల వరకు మ్యాచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు.

తన వద్ద 271.4 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని, అందులో రూ.3.26 లక్షల విలువైన ఆభరణాలు వారసత్వంగా వచ్చాయని,  రూ.5.59 లక్షల విలువైన 171.4 గ్రాముల ఆభరణాలను తాను కొనుగోలు చేశానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కోల్‌కతాలో రూ.1.19 కోట్ల విలువ చేసే ఓ ఫ్లాట్, రెండు కార్లు కూడా ఉన్నట్టు వెల్లడించారు. 30 ఏళ్ల మిమి ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు వివరించారు. 2017-18లో తన వార్షిక ఆదాయం రూ.15.39 లక్షలుగా పేర్కొన్నారు.
Mimi chakraborthy
West Bengal
Elections
jadavpur

More Telugu News