Cyclone: తప్పిన 'ఫణి' ముప్పు... మయన్మార్ వైపు పయనం!

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • గంటకు 9 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను
  • తమిళనాడు, ఏపీలో ఓ మోస్తరు వర్షాలే!

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ వర్షాలను తెస్తుందనుకున్న తుపాను 'ఫణి' దిశమార్చుకుంది. ప్రస్తుతం వాయవ్య దిశగా గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను, బంగ్లాదేశ్, మయన్మార్ వైపు సాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ నెల 30 నాటికి తుపాను తమిళనాడు, కోస్తా తీరానికి దగ్గరగా వస్తుందని, ఆపై అది పక్కకెళ్లిపోతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 29, 30 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలకు అవకాశాలున్నాయని, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నారు. పెను ముప్పు మాత్రం తప్పినట్టేనని అభయమిస్తున్నారు. 

More Telugu News