Chandrababu: సిద్ధంగా ఉండాలి... 'ఫణి' తుపాను నేపథ్యంలో అధికారులకు చంద్రబాబు సూచనలు

  • యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం
  • ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలంటూ దిశానిర్దేశం
  • హిమాచల్ ప్రదేశ్ నుంచే పర్యవేక్షణ

హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పొంచి ఉన్న ‌'ఫణి' తుపాను ముప్పుపై దృష్టి పెట్టారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు సూచనలు అందించారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో విహారయాత్రలో ఉన్నాగానీ చంద్రబాబు 'ఫణి' తుపాను గమనంపై ఆర్టీజీఎస్ నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన 'ఫణి' ప్రస్తుతం మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిక్కుగా 1440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లో మరింత బలపడి తీవ్రతుపానుగా మారి ఆపై ఈ నెల 30న ఏపీ, తమిళనాడు తీరాలకు సమీపానికి వస్తుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News