Visakhapatnam District: విశాఖ జిల్లాలో బీభత్సం సృష్టించిన వర్షం, ఈదురు గాలులు

  • అరగంట పాటు కురిసిన వర్షం
  • నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు
  • నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
విశాఖపట్నం జిల్లాలో ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని నర్సీపట్నంలో నేటి సాయంత్రం దాదాపు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలతో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగాయి. దీంతో నర్సీపట్నంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మామిడి తదితర పంటలకు వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
Visakhapatnam District
Narsipatnam
Rain
Power

More Telugu News