Johnson and Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఎన్సీపీసీఆర్ షాక్!

  • బేబీ షాంపూ, పౌడర్ అమ్మకాలు నిలిపివేయాలి
  • అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ  
  • ఇప్పటికే దుకాణాల్లో ఉన్న ఆయా ఉత్పత్తులను వెనక్కి పంపాలి: ఎన్సీపీసీఆర్

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్సీపీసీఆర్) షాక్ ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన బేబీ షాంపూ, పౌడర్ అమ్మకాలను నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ఇప్పటికే దుకాణాల్లో ఉన్న జాన్సన్ సంస్థకు చెందిన ఆయా ఉత్పత్తులను వెనక్కి పంపాలని ఆదేశించింది. ఆ ఉత్పత్తుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 జైపూర్ లోని డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీలోని నిపుణులు ఇచ్చిన నివేదికను ఎన్సీపీసీఆర్ కి రాజస్థాన్ ప్రభుత్వం అందజేసింది. జాన్సన్ ఉత్పత్తుల్లో ఫార్మల్ డీ హైడ్ ఉండటంతో ఆయా ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని రాజస్థాన్ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఏపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాలు ఈ ఉత్పత్తుల నమూనాలు పరిశీలించి నివేదికలు పంపాలని ఎన్సీపీసీఆర్ ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఈ ఆదేశాలు తమ దృష్టికి రాలేదని ఎన్సీపీసీఆర్ చెబుతోంది. సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీలో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News