Andhra Pradesh: ధాన్యం సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టాం: ఏపీ మంత్రి దేవినేని

  • యార్డుల్లో ఉన్న ధాన్యం తడిస్తే అధికారులదే బాధ్యత
  • పంటను మిల్లులకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలి
  • తుపాన్ ప్రభావం వల్ల ఒక్క ధాన్యపు గింజ కూడా నష్టపోకూడదు

‘ఫణి’ తుపాన్ నేపథ్యంలో మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉన్న ధాన్యం సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టామని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. మైలవరం, గొల్లపూడిలోని మార్కెట్ యార్డులను ఈరోజు ఆయన సందర్శించారు. ధాన్యం, వాణిజ్య పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. తుపాన్ ప్రభావం వల్ల ఒక్క ధాన్యపు గింజ కూడా రైతు నష్టపోకూడదని వేగవంతంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తేమ ఉందంటూ రైతులను ఇబ్బంది పెట్టకుండా పంటను మిల్లులకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాలని, కూలీల కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన బయటి ప్రాంతాల నుంచి తెప్పించుకోవాలని సూచించారు. మార్కెటు యార్డుల్లో ఉన్న ధాన్యం తడిస్తే, అందుకు అధికారులు, స్థానిక నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. 

More Telugu News