Odisha: ఒడిశాలో కొన్ని చోట్ల రీపోలింగ్ కు సీఈవో లేఖ

  • 12 చోట్ల ఇబ్బందులు తలెత్తాయి
  • బ్రహ్మగిరి నియోజకవర్గంలో పొరపాటు జరిగింది
  • ఈవీఎం కంట్రోల్ యూనిట్ తారుమారైంది
మూడో దశ పోలింగ్ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలో 12 చోట్ల ఇబ్బందులు తలెత్తాయని, కాబట్టి ఆయా ప్రదేశాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒడిశా రాష్ట్ర సీఈవో సురేంద్ర కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన సీఈసీకి లేఖ రాశారు.

బ్రహ్మగిరి నియోజకవర్గంలో 62వ పోలింగ్ బూత్‌లో స్ట్రాంగ్ రూం నుంచి సిబ్బంది ఈవీఎంలను తీసుకున్నప్పుడే జరిగిన పొరపాటు కారణంగా ఈవీఎం కంట్రోల్ యూనిట్ తారుమారైందని, కాబట్టి అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. దీంతో పాటు మరో రాష్ట్రంలో మరో 12 చోట్ల ఇబ్బందులు తలెత్తాయని, కాబట్టి అక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాలని సురేంద్ర కుమార్ కోరారు.  
Odisha
Surendra Kumar
CEC
Brahmagiri
EVM
Repolling

More Telugu News