Inter Board: పగడ్బందీగా ఇంటర్‌ మార్కుల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌: బోర్డు కార్యదర్శి అశోక్‌

  • మొత్తం 12 కేంద్రాల ఏర్పాటు
  • కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ
  • ప్రతి రోజూ బులెటిన్‌ విడుదల

ఇంటర్‌ ఫలితాల విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ ఇంటర్‌ బోర్డు మార్కుల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పగడ్బందీగా చేపట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో రీ వెరిఫికేషన్‌, కౌంటింగ్‌ జరుగుతుందని, ఒక్కో కేంద్రంలో 70 వేల నుంచి లక్ష జవాబు పత్రాల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ జరుగుతుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. మొత్తం కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజూ రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌పై బులెటిన్‌ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కాగా, కార్యక్రమంపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కూడా శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

More Telugu News