ఇంటర్లో తప్పినందుకు.. ఆత్మహత్య చేసుకున్న మరో విద్యార్థిని!

- నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలో ఘటన
- ఇంటర్ బైసీపీ చదువుతున్న శిరీష
- ఫలితాల్లో జువాలజీ పరీక్షలో తప్పినట్లు తేలడంతో మనస్తాపం
జిల్లాలోని ఓ కళాశాలలో శిరీష ఇంటర్ బైపీసీ చదువుతోంది. అయితే జువాలజీ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంటి మిద్దె పైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కానీ మంటల బాధ తాళలేక పైనుంచి కిందకు దూకేసింది. కాసేపటికే మరణించింది. మరోవైపు శిరీష మరణంపై కేసు నమోదు చేసిన నారాయణపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.