Anantapur District: పరిటాల శ్రీరామ్ అనుచరులపై కేసు నమోదు

  • నాగసముద్రంలో వైసీపీ కార్యకర్తలపై నిన్న దాడి
  • పరిటాల అనుచరులపై వైసీపీ ఆరోపణలు
  • ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు
అనంతపురం జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలంలోని నాగసముద్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై నిన్న వేట కొడవళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ, ఎన్ఎస్ గేటు వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిన్న ఆందోళనకు దిగారు.  
Anantapur District
chennekotha palli
Telugudesam
ysrcp

More Telugu News