Andhra Pradesh: విజయనగరంలో విచిత్రం.. రెండోసారి ఓటేయాల్సిందిగా పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు పిలుపు!

  • జిల్లాలోని బొబ్బిలిలో ఘటన
  • అధికారుల నిర్లక్ష్యమే కారణమని అనుమానం
  • గందరగోళంపై స్పష్టత ఇచ్చిన రిటర్నింగ్ అధికారి జయరాం

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఉద్యోగులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని బొబ్బిలిలో పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొన్న ఉద్యోగులకు మళ్లీ ఓటు హక్కును వినియోగించుకోవాలని సమాచారం అందుతోంది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని ఉద్యోగులు ఆయా ఆఫీసులకు వెళ్లి మరోసారి వివరాలను అందజేస్తున్నారు.

అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసిన ఉద్యోగులు తమ పేరుకు ఎదురుగా టిక్ పెట్టకుండా వదిలేయడం, ఎవరెవరు ఓటు వేశారో రికార్డుల్లో నమోదు చేయకపోవడం కారణంగా ఈ గందరగోళం నెలకొన్నట్లు చెబుతున్నారు. కాగా, ఉద్యోగుల చిరునామాలు సరిగ్గా లేనందున కొందరు ఉద్యోగులకు రెండేసి సార్లు ఓట్లు వెళ్లాయని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జయరాం తెలిపారు. ఇలా 12 మందికి రెండు సార్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందినట్లు గుర్తించామన్నారు.

More Telugu News