syclone: అటు తుపాన్‌...ఇటు వడగాల్పుల హెచ్చరికలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం

  • బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఫణి తుపాన్‌
  • విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
  • ఉత్తర భారతంలోని పొడిగాలుల ప్రభావంతో వడగాల్పులు వీస్తాయని సూచన

ఓ వైపు తుపాన్‌ హెచ్చరికలు, మరోవైపు హడలుగొడుతున్న ఎండతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘ఫణి’ తుపాన్‌గా మారి కోస్తా తీరంవైపు దూసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పటికే విశాఖ, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీచేశాయి.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం, సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని, బయట తిరిగే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా తెలంగాణలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించడం గమనార్హం.

More Telugu News