Nellore District: వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణపై కేసు నమోదు

  • పోస్టల్ బ్యాలెట్లు తనకు అనుకూలంగా సేకరించాలన్న రామకృష్ణ
  • ‘నీ అంతు చూస్తా’నని ప్రభుత్వ ఉద్యోగికి బెదిరింపు
  • రిటర్నింగ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు

నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లన్నీ తనకు అనుకూలంగా సేకరించాలంటూ ప్రభుత్వ ఉద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయమై ఆయనపై ఈ కేసు నమోదైంది. రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు రాపూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా, పోస్టల్ బ్యాలెట్లను తనకు అనుకూలంగా సేకరించాలని రాపూరు మండలం తెగచర్ల ఫీల్డ్ అసిస్టెంట్ ను రామకృష్ణ ఆదేశిస్తున్న ఆడియో సామాజిక మాధ్యమాలకు చేరింది. అలా చేయని పక్షంలో ‘నీ అంతు చూస్తా’ అని సదరు అసిస్టెంట్ ను రామకృష్ణ బెదిరిస్తుండటం ఈ ఆడియోలో వినపడటం గమనార్హం. 

  • Loading...

More Telugu News