Raj babbar: మోదీ కుర్తా సైజు మమతకు ఎలా తెలుసో?: రాజ్‌బబ్బర్ సూటి ప్రశ్న

  • మమత తనకు మిఠాయిలు, కుర్తా పంపిస్తారన్న మోదీ
  • తమకెప్పుడూ పంపించలేదన్న రాజ్‌బబ్బర్ 
  • ఈ విషయం తెలియక ఇప్పటి వరకు మోదీ చాతీ సైజునే ప్రశ్నించేవారమంటూ ఎద్దేవా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటుడు రాజ్‌బబ్బర్ మండిపడ్డారు. ప్రముఖ సినీ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల్లో తనకు మంచి మిత్రులు ఉన్నారని, పశ్చిమ బెంగాల్ సీఎం మమత తనకు కుర్తాలు, మిఠాయిలు పంపిస్తుంటారని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన రాజ్‌బబ్బర్ మాట్లాడుతూ.. మోదీకి మమత కుర్తాలు, స్వీట్లు పంపించడాన్ని ఎద్దేవా చేశారు. ఆమెకు ప్రధాని కుర్తా సైజు ఎలా తెలుసని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్‌లో రెండు ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాయన్న రాజ్‌బబ్బర్ అందులో ఒకటి వెన్నతో చేసిన మిఠాయిలు కాగా, రెండోది కుర్తాలన్నారు. కానీ మమత ఇప్పటి వరకు మోదీకి తప్ప తమకు కానీ, మరెవరికి కానీ వాటిని పంపలేదన్నారు. కానీ, ఆమె మోదీకి మాత్రమే పంపారని, అంటే మోదీ కుర్తా సైజు ఆమెకు తెలిసి ఉంటుందని అన్నారు. కానీ, ఇప్పటి వరకు ఆ విషయం తెలియక మోదీ 56 అంగుళాల చాతీపైనే ప్రశ్నలు అడిగేవాళ్లమని రాజ్‌బబ్బర్ ఎద్దేవా చేశారు.
Raj babbar
Narendra Modi
Mamata banerjee
kurta

More Telugu News