TTD: హుండీ లెక్కింపుల్లో ఎలాంటి జాప్యం లేదు..‘కోడ్’ ఉన్నంత వరకూ సిఫారసు లేఖలు అనుమతించం: టీటీడీ జేఈవో

  • పరకామణిలో సిబ్బంది కొరత అవాస్తవం
  • మరో మూడు రోజుల్లో కానుకలు మొత్తం లెక్కిస్తాం
  • సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు  

శ్రీవారి హుండీ లెక్కింపుల్లో ఎలాంటి జాప్యం జరగడం లేదని, పరకామణిలో సిబ్బంది కొరత అవాస్తవమని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. సిబ్బంది సెలవుల్లో ఉన్నప్పుడు కానుకల నిల్వ ఏర్పడుతుందని, మరో మూడు రోజుల్లో కానుకలు మొత్తం లెక్కిస్తామని స్పష్టం చేశారు. పరాకమణిలో రేపటి నుంచి అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించమని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఈ సిఫారసు లేఖలు స్వీకరించమని చెప్పారు.

More Telugu News