Hindupuram: హిందూపురంలో మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో బాలకృష్ణ సమావేశాలు!

  • ఎన్నికల పూర్తి వివరాలు కోరిన బాలయ్య
  • భవిష్యత్ ప్రణాళికపై చర్చ
  • ఓట్ల సంఖ్య తదితర సమాచారం కావాలని వెల్లడి
నియోజకవర్గ పరిస్థితిపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఆయన తన నివాసంలో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నేతలకు ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు ఇవ్వాలని బాలయ్య కోరినట్టు తెలుస్తోంది.

ప్రతి పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల సంఖ్య, పోలైన వాటి వివరాలు, ఎన్నికల్లో ఎవరెవరు పని చేశారు? తదితర వివరాలన్నీ తనకు అందించాలని నాయకులకు సూచించినట్టు సమాచారం. భవిష్యత్ ప్రణాళికపై కూడా సమీక్ష సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. నేటి సమావేశంలో చిలమత్తూరు లేపాక్షి మండలాలతో పాటు మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల బూత్ మెంబర్లతో సమీక్ష నిర్వహించారు.
Hindupuram
Balakrishna
Votes
Elections
Chilamattor

More Telugu News