Narendra Modi: ప్రధాని మోదీ ఆస్తుల వివరాలు ఇవిగో!

  • నామినేషన్ దాఖలు చేసిన మోదీ
  • రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ సమర్పణ
  • ఆస్తులే ఉన్నాయి, కేసులు లేవు

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ సమర్పించారు. అందులో స్థిర, చరాస్తుల విలువ రూ.2.51 కోట్లు అని పేర్కొన్నారు. ప్రధానిగా తాను అందుకుంటున్న జీతం, సేవింగ్స్ పై వచ్చే వడ్డీయే తన ఆదాయం అని వివరించారు. స్థిరాస్తి విలువ రూ.1.10 కోట్లు కాగా, చరాస్తి రూ.1.41 కోట్లుగా తెలిపారు.

ఎస్బీఐలో రూ.1.27 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నట్టు పేర్కొన్నారు. తన చేతిలో ఉన్న నగదు రూ.38,750 మాత్రమేనని, బ్యాంకు బ్యాలన్స్ రూ.4,143 అని మోదీ అఫిడవిట్ లో వెల్లడించారు. రూ.1.13 లక్షల విలువ చేసే నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్టు లెక్కలు చూపించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా, గత ఎన్నికల సమయంలో మోదీ తన చరాస్తి విలువను రూ.65.9 లక్షలుగా చూపించారు. ఇప్పుడది రెట్టింపైంది.

More Telugu News