Rahul Gandhi: పేదరికంపై సర్జికల్ దాడులు, న్యాయ్ స్కీమ్‌ల అమలు మా ఆయుధాలు: రాహుల్ గాంధీ

  • లాలూ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు
  • బీహార్ ప్రజలు ఎప్పటికీ మరచిపోరు
  • మోదీని ఎప్పటికీ క్షమించరు

వచ్చే ఐదేళ్లలో న్యాయ్ స్కీమ్‌లు, పేదరికంపై సర్జికల్ దాడులు తమ ఆయుధాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో నేడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ గత ఐదేళ్లలో పెద్ద నోట్ల రద్దుతో, గబ్బర్ సింగ్ టాక్స్‌తో పేదలపై దాడులు జరిపారన్నారు. మోదీకి భిన్నంగా తమ పోరు ఉంటుందని, పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదరిక నిర్మూలనను చేపడతామన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబాన్ని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందంటూ రాహుల్ మండిపడ్డారు. లాలూపై మోదీ కక్ష సాధింపులకు పాల్పడ్డారని... తన తండ్రిని ఆసుపత్రిలో కలుసుకునేందుకు కూడా తేజస్వి యాదవ్‌ను అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీహార్ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని.. మోదీని ఎప్పటికీ క్షమించరని రాహుల్ పేర్కొన్నారు.

More Telugu News