Nizamabad: నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది: లక్ష్మణ్ ధీమా

  • టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే
  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది
  • పసుపు బోర్డు కచ్చితంగా ఏర్పాటు చేస్తాం

నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారణాసిలో నామినేషన్ వేసేందుకు ఇక్కడి నుంచి వెళ్లిన వారి గురించి ఆయన ప్రస్తావించారు. అక్కడ నామినేషన్లు వేసింది టీఆర్ఎస్ కు చెందినవారేనని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డు కచ్చితంగా ఏర్పాటు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News