ka paul: తెలంగాణ విద్యార్థులకు శ్రీలంక నుంచి కేఏ పాల్ ట్వీట్

  • ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు
  • కేసీఆర్ న్యాయం చేస్తారని భావిస్తున్నా
  • శ్రీలంకలో ఇన్నాళ్లూ ఇంటర్నెట్ లేదు

తెలంగాణ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్త విని చాలా ఆవేదనకు లోనయ్యానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పారు. చావు దేనికీ పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా న్యాయం చేస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన న్యాయం చేయలేని పక్షంలో తాను విద్యార్థులకు అండగా నిలబడతానని, న్యాయం కోసం పోరాడదామని చెప్పారు.

ప్రస్తుతం తాను శ్రీలంకలో ఉన్నానని... బాంబు పేలుళ్లలో ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొన్ని వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కొన్ని రోజులుగా ఇక్కడ ఇంటర్నెట్ లేదని, ఇప్పుడే ఆన్ అయిందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులు, శ్రీలంక మృతుల కుటుంబాల కోసం అందరూ భగవంతుడిని ప్రార్థించాలని చెప్పారు.

More Telugu News