Snake: ఒకరిని కాటేసిన అరుదైన పాము... కొట్టి చంపిన పెనుకొండ వాసులు!

  • పాత సామాన్లు తీస్తుండగా బయటకు వచ్చిన పాము
  • పాము కరవడంతో బాధితుడు ఆసుపత్రికి
  • విషరహిత సర్పమన్న నిపుణులు
అనంతపురం జిల్లా పెనుకొండలో అత్యంత అరుదైన పాము కనిపించగా, విషయం తెలియని ప్రజలు ఒకరిని కాటేసిందన్న కారణంతో దాన్ని కొట్టి చంపారు. స్థానిక మారుతీ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి, తన ఇంట్లోని పాత సామాన్లు తీస్తుండగా, పాము అతన్ని కాటేసింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించిన కాలనీ వాసులు, పామును కొట్టి చంపేశారు. ఆపై పామును పరిశీలించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదా శివయ్య, ఇది చాలా అరుదైన పామని, విష రహితమని స్పష్టం చేశారు. దీన్ని లైకోడాన్‌ ఫ్లబికొల్లిస్‌ అన్న శాస్త్రీయనామంతో పిలుస్తారని, తిరుమల కొండల్లో మాత్రమే కనిపించే ఈ పాములు పెనుకొండలో ఉన్నాయంటే, గతంలో ఈ ప్రాంతం జీవ వైవిధ్యంతో నిండిందని చెప్పవచ్చని వ్యాఖ్యానించారు.
Snake
Anantapur District
Penkonda

More Telugu News