Neerav Modi: నీరవ్ మోదీ కార్లను వేలం వేయనున్న ఈడీ!

  • పీఎన్‌బీకి వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ
  • అనేక అభియోగాలను మోపిన ఈడీ
  • ఆస్తులను వేలం వేయాలని ఆదేశించిన కోర్టు
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను ఈడీ వేలం వేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లలో టోపీ పెట్టి బ్రిటన్‌కు పారిపోయాడు. ఇటీవలే ఆయన బ్రిటన్‌లో అరెస్ట్ అయ్యాడు. ఆయనపై అనేక అభియోగాలను ఈడీ మోపగా, వాటిని పరిశీలించిన ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఆయన ఆస్తులను వేలం వేయాలని ఆదేశించింది.

దీనిలో భాగంగా ప్రస్తుతం నీరవ్ మోదీ కార్లను వేలం వేస్తున్నారు. ఆయన వద్ద ఉన్న 13 కార్లలో, రోల్స్ రాయిస్ అత్యంత విలువైంది. వేలంలో దాని ప్రారంభ ధరను రూ.1.3 కోట్లుగా నిర్ణయించారు. దాని అసలు ధర రూ.5 కోట్లు. ఇప్పటికే నీరవ్ మోదీకి చెందిన పెయింటింగ్‌ల వేలం ద్వారా రూ.54 కోట్లను పొందిన ఈడీ, కార్లకు మంచి ధర పలుకుతుందని భావిస్తోంది.
Neerav Modi
Mumbai
ED
Roles Royals
Paintings
Britain

More Telugu News