shivara raj kumar: కన్నడ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ రోల్

  • శివరాజ్ కుమార్ హీరోగా 'భైరతి రణగళ్'
  • కీలకమైన పాత్రలో బాలకృష్ణ 
  • తరువాతనే బోయపాటి సినిమా

బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బోయపాటి శ్రీను ఇంకా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూనే వున్నాడట. స్క్రిప్ట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఆయన ఉండటం వలన ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది.

ఈ లోగా ఒక కన్నడ సినిమాలో నటించడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారని సమాచారం. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా 'భైరతి రణగళ్' రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ ఉండటంతో దానిని బాలయ్యతో చేయించాలనుకున్న శివరాజ్ కుమార్, ఆయనని ఒప్పించారు. శివరాజ్ కుమార్ తో గల సాన్నిహిత్యం కారణంగా బాలకృష్ణ ఈ రోల్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగు పూర్తయ్యేలోగా బోయపాటి తన ప్రాజెక్టుకి సంబంధించిన పనులను పూర్తి చేస్తాడట.

More Telugu News