Bay Of Bengal: బంగాళాఖాతంలో వాయుగుండం... తుపానుగా మారితే ఈ పేరుతోనే పిలవాలి!

  • 'ఫణి'గా నామకరణం చేసిన అధికారులు
  • కన్యాకుమారి వద్ద తీరం దాటే అవకాశం
  • ఈ నెల 27 నుంచి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాగల 36 గంటల్లో తుపానుగా మారి దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, పాండిచ్చేరి ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం తుపానుగా మారితే దాన్ని 'ఫణి' అనే పేరుతో పిలుస్తారు. ఫణి అంటే పాము అని అర్థం. ఈ నెల 30న ఫణి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తమిళనాడులోని ప్రలు ప్రాంతాల్లో ఈ నెల 27 నుంచి వర్షాలు పడతాయని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు తీరప్రాంతంలో అలల ఉద్ధృతి మరింత పెరిగింది.

More Telugu News