Telangana: ఇంటర్ ఫలితాల గందరగోళంపై ప్రభుత్వం సరిగా స్పందించలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదనను గవర్నర్ దృష్టికి తెచ్చాం
  • విద్యా శాఖా మంత్రి తన పని తాను చేయలేకపోయారు
  • ప్రభుత్వంపై విద్యార్థులు విశ్వాసం కోల్పోయారు

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై ప్రభుత్వం సరిగా స్పందించలేదని గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశామని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ కు అఖిలపక్షం ఫిర్యాదు చేసింది. అనంతరం, మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంపై విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని, లక్షలాది మంది విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆవేదనతో ఉన్నారని, వారి ఆవేదనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విద్యా శాఖా మంత్రి తన పని తాను సరిగా చేయలేకపోయారని, మంత్రి వర్గం నుంచి ఆయన్ని తొలగించాలని కోరామని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని గవర్నర్ ను కోరినట్టు చెప్పారు. 

More Telugu News