vijayashanthi: స్టార్ హీరోయిన్ తో సమానంగా విజయశాంతి పారితోషికం!

  • మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ
  •  కీలకమైన పాత్రలో విజయశాంతి
  • చాలా గ్యాప్ తరువాత అంగీకరించిన సినిమా  

నిన్నటితరం కథానాయికగా తెలుగు తెరపై విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. అగ్రకథానాయకులందరి కాంబినేషన్లో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాలకి ప్రాధాన్యతనిస్తూ సినిమాలను దూరం పెట్టారు. అలా నటనకి విజయశాంతి దూరమై చాలాకాలమే అయింది. ఈ నేపథ్యంలో ఆమెతో రీ ఎంట్రీ ఇప్పించేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నించి సక్సెస్ అయినట్టుగా వార్తలు వచ్చాయి.

మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతి అయితేనే బాగుంటారని భావించి ఆయన ఆమెను సంప్రదించి ఒప్పించడం జరిగింది. విజయశాంతికి గల క్రేజ్ తెలిసిందే గనుక, ఆమెకి పారితోషికంగా ఎంత ముడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం ఆమె 2 కోట్లు అడిగారనీ, కోటి నుంచి కోటిన్నర ఆమెకు ముట్టనుందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అంటే ఒక స్టార్ హీరోయిన్ తీసుకునేంత పారితోషికం విజయశాంతికి ముడుతోందన్న మాట.

More Telugu News