Nagababu: ఎంపీగా గెలిస్తే సినిమాలు చేయలేను: నాగబాబు

  • అభిమాని అడిగిన ప్రశ్నకు మెగాబ్రదర్ సమాధానం
  • జబర్దస్త్ ను మాత్రం వదులుకోను
  • ఈ షోకి నేను కేటాయించేది నాలుగైదు రోజులే
మెగాబ్రదర్ నాగబాబు లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ తరఫున ఆయన బరిలో దిగారు. అయితే, పోలింగ్ రోజున ఓ బూత్ వద్ద ఒక పెద్దావిడ అడిగిన ప్రశ్నకు తాను ఏమని బదులిచ్చిందీ తాజాగా అభిమానులతో పంచుకున్నారు.

"ఎంపీగా గెలిస్తే జబర్దస్త్ మానేస్తావా? నువ్వు ఆ కార్యక్రమం చేయాల్సిందే, మానేస్తానంటే ఒప్పుకునేది లేదు అంటూ ఆ పెద్దావిడ ఎంతో అభిమానంతో చెప్పారు. నిజమే, జబర్దస్త్ అనేది ఒక సేవ. అయితే అది పెయిడ్ సర్వీస్. దాని ద్వారా నాకు కొంత ఆదాయం వస్తోంది. ఎంతచేసినా ఆ కార్యక్రమానికి నేను నాలుగైదు రోజులు కష్టపడతానంతే. ఎంపీగా గెలిచినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఓవైపు జబర్దస్త్ చేస్తూనే ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించగలను. జబర్దస్త్ అనేది ప్రజలు మెచ్చిన కార్యక్రమం. తప్పకుండా చేస్తాను. కానీ, మునుపటిలా సినిమాలు చేయలేకపోవచ్చు. అంత సమయం ఉండకపోవచ్చు" అంటూ వివరణ ఇచ్చారు.
Nagababu

More Telugu News